Illegal structures:మేడ మీద మేడ అనుమతి ఏడా?

On
Illegal structures:మేడ మీద మేడ అనుమతి ఏడా?
కొత్తపేట లోని అష్టలష్మి కామన్ రోడ్డు లో ఏలాంటి అనుమతులు లేకుండా సెల్లార్ తో పాటు కమర్షియల్ భవనం

సరూర్ నగర్ సర్కిల్ లోని  అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎక్కడ.
 మచ్చు కైనా కనిపించని సెట్ బ్యాగులు.

 కుర్చీలకే పరిమితమవుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.

 అధికారుల భరోసాతో యాథేచ్చగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు.
 తీసుకుంటున్న అవినీతి సొమ్ముకు కట్టుబడి ఉంటున్న సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు.

 సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణదారులకు అవినీతి అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయా.. టౌన్
ప్లానింగ్ లోని అవినీతి అధికారుల అండతోనే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల వెలుస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది

 ఎల్బీనగర్ జోన్ ప్రతినిధి- నేటి ప్రభాత సూర్య :
అనుమతులు లేని భవనాలను కూల్చి వేయండి ప్రభుత్వం చెపుతుంటే..అందుకు విరుద్దంగా వ్యవహారిస్తున్నారు సరూర్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు..ఏలాంటి అనుమతులు లేకుండా నిబంధనలు తుంగలో తొక్కి సెల్లార్ తో పాటు బహుళ అంతస్తూ భవనం నిర్మిస్తున్నా పట్టి పట్టనట్లు అధికారులు వ్యవహరించిన తీరు చూస్తుంటే లక్షల్లో దండుకొని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి..మున్సిపల్ ఆఫీస్ కి కూత వేటు దూరంలో నిర్మాణం జరుతున్న విషయం పై పలు పిర్యాదు లు వెళ్ళు వేత్తిన అధికారులు పట్టించు కోవడం లేదు..వివరాల్లోకి వెలితే కొత్తపేట లోని అష్టలష్మి కామన్ రోడ్డు లో ఏలాంటి అనుమతులు లేకుండా సెల్లార్ తో పాటు కమర్షియల్ భవనం నిర్మిస్తున్నాడు. ఆరోడ్డు 60 ఫిట్ల రోడ్డుగా మాస్టర్ ప్లాన్ లో ఉన్నప్పటికి ఏలాంటి సెట్ బ్యాక్ లేకుండా అక్రమంగా నిర్మాణం కొనసాగుతుంది. ఈ నిర్మాణం విషయం లో పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులకు పిర్యాదు చేస్తే కేవలం నోటీసు లు ఇచ్చిన అధికారులు అందిన కాడికి దండుకొని చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు వెలువాడుతున్నాయి.అనుమతులరూపంలోప్రభుత్వనీకిరావాల్సిన అదయానికి గండికొడుతున్న అధికారులు కేవలం మా జేబులు నిండితే చాలు అన్నట్లు వ్యవహారిస్తున్నారు ఇప్పటికైనా జోనల్ కమీషనర్ సంబందించిన అక్రమ నిర్మాణానికి గుర్తించి తగినచర్యలు తీసుకోవాలని ప్రజలు సదరుకాలనీ వాసులుకోరుతున్నారు..

Views: 8

About The Author

Tags: #ghmc#

Latest News