Lurking danger.:పొంచి ఉన్న ప్రమాదం.  వర్షానికి కుంగిన వ్యవసాయ బావి పక్కన రోడ్డు.

On
Lurking danger.:పొంచి ఉన్న ప్రమాదం.  వర్షానికి కుంగిన వ్యవసాయ బావి పక్కన రోడ్డు.
వర్షానికి కుంగిన వ్యవసాయ బావి పక్కన రోడ్డు

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం. 
ఆదమరిస్తే అంతే సంగతి.

గన్నేరువరం- నేటి ప్రభాత సూర్య: మండలంలోని గునుకుల కొండాపూర్ లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నెహ్రూ చౌరస్తాకు సమీపంలో రోడ్డు ప్రక్కనే ఉన్న వ్యవసాయ బావి వద్ద రోడ్డు బావిలోకి కుంగిపోయింది. అదృష్టవశాత్తు రాత్రిపూట ఏ భారీ వాహనం ఆ వైపుగా ప్రయాణం చేయకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఏదైనా వాహనం బావి పక్కనున్న రోడ్డు వెంట వెళ్ళినట్లయితే మొత్తం రోడ్డు కూలీ బావిలోనే పడిపోవాల్సి వస్తుంది.

55dba8dc-d0a4-435a-918c-974d8e0533e9 ఉదయం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రవి గౌడ్, లింగంపల్లి హరీష్ లు రోడ్డు పరిస్థితిని గమనించి దగ్గర్లో ఉన్న రాళ్లను, తాటి కమ్మలను రోడ్డుపై సూచిక గా ఉంచారు. రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ రోడ్డు పక్కన ఉన్న బావుల వద్ద రక్షణ గోడ నిర్మించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామ పంచాయతీ కార్మికులు కర్రలతో రక్షణ ఏర్పాటు చేశారు. ఎన్నిసార్లు పలువురు నిరసన తెలిపినప్పటికీ కాంట్రాక్టర్ కు చీమకుట్టినట్టు కూడా లేదు. ఏదైనా ప్రమాదం జరిగి వాహనాలు బావులలో పడి ప్రాణాలు కోల్పోతే తప్ప అధికారులు నాయకులు కాంట్రాక్టర్ స్పందిస్తారో లేదో వేచి చూడాలి. ఇప్పటికైనా కాంట్రాక్టర్ పై అధికారులు చర్యలు చేపట్టి రోడ్డు వెంట బావుల వద్ద రక్షణ చర్యలు చేపట్టా లని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Views: 151

About The Author

Latest News