Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డు..!

On

  • చరిత్ర సృష్టించిన గిల్ 

Shubman Gill : ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు లంచ్ తరువాత గిల్ ఈ అరుదైన ఘనత సాధించాడు. గిల్ కి టెస్టుల్లో ఇది తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ మైలు రాయిని గిల్ 311 బంతుల్లో చేరుకున్నాడు. ఈ డబుల్ తో గిల్ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. 

Gill  (2)

ఇంగ్లాండ్  గడ్డ పై టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్ గా ఇంగ్లాండ్ డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా.. టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్ గా విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించాడు. రెండో భారత కెప్టెన్ గా పలు రికార్డులు సాధించాడు. ఈ డబుల్ సెంచరీతో గిల్ చిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు. 

Views: 2

About The Author

Latest News