కవిత వార్త కవర్ చేయని నమస్తే తెలంగాణ
బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ నమస్తే తెలంగాణ ద్వారా క్లీయర్ గా చెప్పేసిందా?
.jpeg)
కవితతో బీఆర్ఎస్ కు సంబంధం లేదని తేల్చేసినట్టేనా?
వారాంతంలో వార్తలకు కొరత ఉంటుంది. ఇచ్చిన వార్తలనే మళ్లీ ప్లే చేయాల్సిన పరిస్థితి మీడియా ఛానళ్ల పరిస్థితి. ఏవో స్పెషల్ ప్రోగ్రామ్స్, డిబేట్లతో సమయం గడపిస్తుంటారు. ఈ ఆదివారం కూడా ఉదయం కొద్దిసేపటి వరకు అదే పరిస్థితి ఉంది. కానీ ఆ తర్వాత అంతా మారిపోయింది. మీడియా ఛానళ్లకు కావాల్సిన, నడాపాల్సినంత కంటెంట్ దొరికేసింది. అదే తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తల దాడి. అలాగే ఇవాళ ఉదయం వెలువడ్డ న్యూస్ పేపర్లలోనూ ఈ వార్తలకు ప్రాధాన్యం దక్కింది. ఐతే ఒక్క నమస్తే తెలంగాణ మాత్రం కవిత ఇష్యూని కనీసం చిన్న వార్తగానైనా కవర్ చేయలేకపోయింది. ఎందుకంటారు? దీని వెనుక ఉన్న నిగూఢ అర్థం ఏమిటీ? పార్టీ కవితను పక్కన పెట్టేసినట్టేనా?
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ఇప్పుడు హాట్ టాపిక్. అన్ని పార్టీలు, అందరు నేతలు బీసీ రిజర్వేషన్ల అంశంపైనే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తన జాగృతి ద్వారా కూడా బీసీ నినాదం అందుకున్నారు. అటు తీన్మార్ మల్లన్న కూడా బీసీ ఉద్యమం అంటున్నారు. ఈక్రమంలో తీన్మార్ మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో జాగృతి కార్యకర్తలు క్యూస్ ఆఫీసుపై దాడులకు దిగారు. ఈ ఘటనలో మల్లన్న గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ దాడితో అప్పటి వరకు స్తబ్ధుగా నడిచిన వార్తలు కాస్త ఊపందుకున్నాయి. మీడియా ఛానళ్లు అన్ని దాడి ఘటనను గంటల కొద్ది నడిపేశాయి. ఇక ఈ అంశంపై కవిత, మల్లన్న ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం పోలీస్ స్టేషన్లు ఫిర్యాదులు అందుకోవడం అన్ని జరిగిపోయాయి.
ఈ వార్తల ప్రభావం సోమవారం కూడా కొనసాగింది. ఐతే రాష్ట్రంలో ఉన్న అన్ని పత్రికలు ఉదయం మల్లన్న ఆఫీసు పై దాడి కవిత ఫిర్యాదు అంశాన్ని కవర్ చేశాయి. కొన్ని పత్రికలు మెయిన్ పేజీ వార్తను కూడా చేశాయి. కానీ నమస్తే తెలంగాణ మాత్రం అసలు ఈ అంశాన్ని టచ్ కూడా చేయలేదు.
కవితపై ఓ ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా రాయలేదు. మల్లన్న అంటే బీఆర్ఎస్ పార్టీకి, నమస్తే తెలంగాణ దూరంగానే ఉంటాయి. కానీ కవిత అలా కాదు. బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఏ అంశాన్నైనా ఆ పార్టీ పెద్ద ఎత్తున కవర్ చేస్తుంది. కానీ కవిత విషయంలో అలా జరగలేదు. కనీసం ఓ మూలన చిన్నగా కూడా కవర్ చేయలేకపోయింది.
నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేతకు చెందిన పత్రిక. ఇది అందరికీ తెలిసిన విషయమే. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటో.. అదే ఆ పత్రిక ఫాలో అవుతుంది. నమస్తే తెలంగాణ ఒక్క అక్షరం కూడా రాయకపోవడం ఆ పార్టీ ఆదేశాల మేరకే జరిగింది అని భావిస్తున్నారు. అన్ని పేపర్ల లాగా అనుకుంటే కనిసం చిన్ని వార్తగానైనా వార్త వేయాల్సింది. కానీ నమస్తే తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ తో కవితకు సంబంధం లేదనే విషయం తెలియజేయడానికే..పక్కన పెట్టిందా? అనే చర్చజరుగుతోంది. కవిత విషయంలోనూ ఆ పార్టీ నేతలు ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. ఇంత జరుగుతున్నా...కేటీఆర్, హరీశ్ రావు సహా ఇతర నేతలెవరూ..స్పందించలేదు. అలాగే ఆ పార్టీ సోషల్ మీడియాలో కూడా కవితకు సపోర్ట్ గా పోస్టులు కూడా కనిపించలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీతో కవిత తెగతెంపులు చేసుకునేందుకు పూర్తిగా సిద్ధమైనట్టు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.
About The Author
