దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి వైద్యురాలి నిర్లక్ష్యం
- నిన్న, మొన్న జాయిన్ అయిన దాన్ని కాదు : డాక్టర్ నాగజ్యోతి
- చూడకుండానే నాకు అన్ని తెలుసు
-
పేషెంట్లకు తప్పని తిప్పలు
నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతీయ వైద్య శాలలో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఆసుపత్రి వచ్చే రోగులను వైద్యులు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇటీవలే నేరేడుగొమ్ము గ్రామానికి చెందిన నల్లవెల్లి అశ్విని మూడో కాన్పు కోసం వస్తే.. దేవరకొండ వైద్యుల నిర్లక్ష్యంతో నల్గొండ జిల్లా ఆసుపత్రికి పంపించారు. అక్కడ కూడా వైద్యులు నిర్లక్ష్యం చేయడం కారణంగా ఆ మహిళా కుర్చీలోనే డెలివరీ అయింది. దీంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ సమయంలో విధుల్లో ఉన్న వారిని జిల్లా వైద్యాధికులు సస్పెండ్ చేశారు. అయినప్పటికీ వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. ఇంకా అలాగే వ్యవహరిస్తున్నారు.
తాజాగా నేరేడుగొమ్ము గ్రామానికి చెందిన మరో వ్యక్తి దేవరకొండ ఏరియా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చాడు. ఈ నెల 07వ తేదీన డెంటల్ విభాగాన్ని సంప్రదిస్తే.. ఆ రోజు ఎవ్వరూ కూడా విధుల్లో లేరు. అక్కడ ఉన్న వారికి అడిగితే కొంత మంది తమకు తెలియదని చెప్పారు. తిరిగి మరల ఈనెల 04వ తేదీన ఏరియా ఆసుపత్రికి దంతాలకు సంబంధించిన సమస్యతో వచ్చాడు. అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్ నాగజ్యోతి ఆసుపత్రికి సమయానికి హాజరు కాలేదు. దాదాపు 10.30 గంటల వరకు వేచి చూడాల్సిన పరిస్తితి నెలకొంది. వైద్యం కోసం ఎంత సేపు అయినా వేచి చూద్దామని వేచి చూసినప్పటికీ.. 10.30 గంటలకు హాజరైన డాక్టర్ నాగజ్యోతి పేషెంట్ నల్లవెల్లి ఆంజనేయులు తమ సమస్యను చెప్పాడు. అయితే సమస్యను వినకుండా కేవలం మాత్రలు మాత్రమే రాసి ఇచ్చింది. కనీసం చిగురు వాపు వచ్చిందని.. చిగురులోంచి బ్లడ్ వస్తుందని సమస్యను వివరించినా.. సమస్య తమకు పట్టదన్నట్టు చెక్ కూడా చేయకుండా టాబ్లెట్ వేసుకోండి అని రాసి ఇవ్వడం గమనార్హం. ఇదేమిటి మేడం అని ప్రశ్నించిన నల్లవెల్లి ఆంజనేయులు ని నేను నిన్న, మొన్న జాయిన్ దాన్ని కాదు.. నేను చూడకున్నా కానీ నాకు అన్ని తెలుసు అని సమాధానం చెప్పడం గమనార్హం. ఒక వైద్యురాలు ఇలా చేయడం ఏంటి..? ప్రశ్నించినప్పటికీ.. నా పేరు డాక్టర్ నాగజ్యోతి.. నేను చాలా సీనియర్ ఏం చేసుకుంటారో చేసుకోండి అని వచ్చిన పేషెంట్ నే బెదిరించడం విశేషం.
నేను నిన్న మొన్న జాయిన్ అయిన దాన్ని కాదు : డాక్టర్ నాగజ్యోతి
నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ దంత విభాగంలో పని చేస్తున్నాను. నేను నిన్న మొన్న జాయిన్ అయిన దాన్ని కాదు. చూడకుండానే నాకు అన్ని తెలుసు. టాబ్లెట్లు వాడండి అని పేర్కొంది డాక్టర్ నాగజ్యోతి.
ఇలాంటి వైద్యుల వల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు చెడ్డ పేరు : పేషెంట్ నల్లవెల్లి ఆంజనేయులు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. కానీ ఇలాంటి డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రినే కదా సమయానికి పోకుంటే అనేది పట్టించుకునేదెవ్వరు. నా ఇష్టం వచ్చినట్టు వస్తాం. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఒకవేళ డాక్టర్ లేని సమయంలో ఇన్ చార్జీగా వేరొకరినైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. డాక్టర్ నాగజ్యోతి కనీసం తనకు సంబంధించిన పళ్లు లూజుగా ఉన్నాయి.. చిగురులోంచి బ్లడ్ వస్తుంది అని సమస్యను వివరించినప్పటికీ.. ఏ పళ్లు అని కూడా అడగకుండానే టాబ్లెట్స్ రాసింది. అస్సలు చెక్ కూడా చేయలేదు. చెక్ చేయనిది టాబ్లెట్లు ఎలా రాస్తారని అడిగితే నాకు అన్ని తెలుసు అని..నేను నిన్న మొన్న రాలేదు అని సమాధానం చెప్పడం విశేషం. ఇలాంటి డాక్టర్ల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వ ఆసుపత్రులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయం.
About The Author
