Local body elections:వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు
తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు రంగం సిద్ధం వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు

గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై సానుకూలత
పథకాల అమలుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెరిగిన ప్రజాధరణ
ప్రభాత సూర్య- తెలంగాణ బ్యూరో:
తెలంగాణ ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలకు సిద్దమైందా? అనుకున్న టార్గెట్ చేరుకోవడంతో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటోందా? గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు సానుకూలత ఏర్పడిందా? కాంగ్రెస్ వేసిన ప్లాన్ వర్కవుట్ అయ్యిందా.? అంటే అవుననే సమధానం వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే నెలలో నిర్వహిస్తామని మంత్రులు వరుస పెట్టి చెప్తున్నారు.
రాష్ట్రంలో ఎప్పటి నుంచో స్థానిక సంస్థల ఎన్నికలై ఉత్కఠం నెలకొంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. దీంతో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా? అనే ప్రశ్నలు పోటీ చేయాలనుకున్న అభ్యర్థులను వెంటాడాయి. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో కుదురుకోవడానికి కాస్త టైం పట్టింది. బీఆర్ఎస్పై వ్యతిరేకత ప్రజల్లో ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించలేకపోయింది. పథకాల అమలు, పాలనపరమైన అంశాలపైనే కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ తన మార్కు పాలన చూపించింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వాలు అన్ని అనుకూతలు చూస్తుంది. ప్రతికూలత ఉంటే ఎన్నికలను వాయిదా వేయడం అన్ని ప్రభుత్వాలకు అలవాటే. ఇదే ఫార్ములాను కాంగ్రెస్ ప్రభుత్వం పాటించింది. ఐతే ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి ప్రభుత్వానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు అంచనా వేసింది. దీంతో స్తానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రాండ్ సక్సెస్ అని చెప్పొచ్చు. ప్రతి గ్రామంలో భారీగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అలాగే సన్నబియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోలు, రైతులకు రుణమాఫీ, మహలక్ష్మి పథకాల అమలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఏర్పడిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే...తప్పక అన్ని స్థానాల్లో గెలుస్తుందని భావిస్తున్నారు. దీంతో ఇదే మంచి సమయమని..స్తానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అయ్యింది. వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే ప్రక్రియ ముగించాలని భావిస్తోంది.
About The Author
