Anchor Swetcha : పూర్ణ చందర్ కి 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకి తరలింపు
- పూర్ణ చందర్ కన్ఫషన్ స్టేట్ మెంట్ లో సంచలన విషయాలు
Anchor Swetcha : T-న్యూస్ లో యాంకర్ పని చేసే స్వేచ్ఛ మొన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తన తండ్రి శంకర్ ఫిర్యాదులో పూర్ణ చందర్ వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పూర్ణ చందర్ ను పోలీసులు అరెస్ట్ చేసి జడ్జీ ముందు హాజరుపరిచారు. పూర్ణ చందర్ కి జడ్జీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పూర్ణ చందర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. పూర్ణ చందర్ కన్ఫషన్ స్టేట్ మెంట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.
ముఖ్యంగా కన్ఫషన్ స్టేట్ మెంట్ లో ఓ రాజకీయ నాయకుడి పేరు వెల్లడించినట్టు తెలుస్తోంది. తనకు సంబంధించిన అన్ని విషయాలు ఒక రాజకీయ నాయకుడికి తెలుసు అని పూర్ణచందర్ చెప్పినట్టు సమాచారం. నన్ను ఏమి చేయలేవు స్వేచ్ఛ.. అంటూ బెదిరించినట్టు సమాచారం. స్వేచ్ఛను భర్తతో విడాకులు తీసుకోమని చెప్పి.. పెళ్లి చేసుకుంటానని పూర్ణ మోసం చేసినట్టు తెలుస్తోంది. పూర్ణ చందర్ మాటలు నమ్మి భర్తకు విడాకులు ఇచ్చింది స్వేచ్ఛ. పెళ్లి ప్రస్తావనను దాటవేస్తూ.. వచ్చిన పూర్ణ చందర్.. వారం రోజుల క్రితం అరుణాచలం వెళ్లారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ కి స్వేచ్ఛ, పూర్ణచందర్ వచ్చారు.
వాస్తవానికి అరుణాచలం నుంచి తిరిగి వస్తున్న సమయంలోనే పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. పూర్ణ చందర్ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పినట్టు విచారణలో వెల్లడించారు. నన్ను ఏమి చేయలేవని.. తనకు రాజకీయ అండదండలున్నాయని పూర్ణ చందర్ బెదిరించినట్టు సమాచారం. స్వేచ్ఛతో రిలేషన్ లో ఉన్న విషయం రాజకీయ నాయకుడికి తెలుసు అని పూర్ణ చందర్ పోలీసులకు వివరించారు.
About The Author
